విద్యా విధానాన్ని అధ్యయనం చేయడానికి ఫిన్‌లాండ్ పంపించాం: రేవంత్ రెడ్డి
- అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యావిధానాలను అమలు చేస్తామని హామీ
- విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకు రాగలమన్న రేవంత్ రెడ్డి
- అందుకే విద్యాశాఖను తాను నిర్వహిస్తున్నట్లు వెల్లడి
విదేశాల్లో అమల్లో ఉన్న విద్యావిధానాలను అధ్యయనం చేయడానికి 25 మంది టీచర్లను ఫిన్‌లాండ్‌కు పంపించామని, అవసరమైతే మరిన్ని దేశాలకు పంపించి ఉత్తమ విద్యావిధానాలను తెలంగాణలో అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విద్యావారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యావ్యవస్థకు సంబంధించి రూ.1,100 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురాగలమని, అందుకే విద్యాశాఖను తానే నిర్వహిస్తున్నానని అన్నారు. విద్యా వ్యవస్థలో తెలంగాణ దశాబ్దాలుగా వివక్షకు గురైందని అన్నారు. అందుకే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, నాటి నుంచి నాలుగున్నర దశాబ్దాలు పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని అన్నారు.
తమ ప్రభుత్వం రాగానే 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని, 60 రోజుల్లో పరీక్షలు నిర్వహించి నియమక పత్రాలు అందించినట్లు చెప్పారు. వివాదాలు లేకుండా 36 వేల మంది టీచర్లను బదిలీ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు ఫలితాల్లో ఎందుకు వెనుకబడి ఉన్నాయో ఆలోచించాలని అన్నారు. విద్యాశాఖకు 15 శాతం నిధులు పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉత్తమ విద్యావిధానాలను అమలు చేస్తామని అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకహారం పెట్టనున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని అన్నారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, కానీ మనం మాత్రం ఇంకా కాలం చెల్లిన సిలబస్‌నే కొనసాగిస్తున్నామని అన్నారు. టెన్ ప్లస్ టు విధానం లేకపోవడం వల్ల డ్రాపవుట్లు పెరుగుతున్నాయని వెల్లడించారు. కుల వివక్షను నిర్మూలించేందుకు తాము ఇంటిగ్రేడెట్ స్కూళ్ళ నిర్మాణం చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.